లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనసూయ….

లక్కీ ఛాన్స్ కొట్టేసిన అనసూయ....

0
101

టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మతో ఖిలాడి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే… ఈ చిత్రంలో హీరోయిన్స్ గా మీనాక్షీ దీక్షిత్ డింపుల్ హయతి నటిస్తున్నారు… కాగా ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది…

రవితేజ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.. తాజాగా చిత్ర యూనిట్ అనసూయను సంప్రదించారట… ఇక ఈ చిత్రానికి సంబంధించి కథ విన్న హాట్ భామ ఒకే చెప్పేసిందట…

కాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో నటించిన రంగస్థలం చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించిన సంగతి తెలిసిందే…. రంగమ్మత్త పాత్రలో నటించడంతో ఆమెను ఇప్పుడు రంగమ్మత్తగా గుర్తింపు తెచ్చుకుంది మరి మాస్ రాజ చిత్రంలో అలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి….