తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి… ఇటీవలే ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడినా కూడా నరేష్, జీవితా రాజశేఖర్ లు మెట్టు దిగకున్నారు… అందుకే తాజాగా నరేష్ పై వేటు వేసేందుకు మా ఈసీ సభ్యులు ముమ్మరం చేశారు…
ఈ మేరకు క్రమశిక్షణ సంఘానికి తొమ్మిది పేజీల లేఖ అందించారు… నరేష్ ను పదవి నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. మా అభివృద్దికి నరేష్ అడ్డంకిగా మారారని అంతేకాదు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి…
ఆయన నిర్ణయాలవల్ల మా పూర్తిగా బ్రస్ట్ పట్టిపోతుందని ఆ లేఖలో జీవితా రాజశేఖర్ పేర్కొన్నట్లు తెలిసింది… అందుకే నిబంధనలకు ఉళ్లంగించిన నరేష పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి జీవితా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది… మా క్రమ శిక్షణ సంఘవలో మురళీ మోహన్ మోహన్ బాబు చిరంజీవి జయసుధలు ఉన్నారు…