లోకల్, నాన్ లోకల్ ఎందుకు తెస్తున్నారు : ప్రకాశ్ రాజ్ సీరియస్

0
94

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మీడియాతో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన ప్యానల్ గురించి ఆయన వివరించే క్రమంలో మీడియాకు సైతం చురకలు వేశారు. గత ఎన్నికల్లో అజెండాలో లేని అంశాన్ని ఈసారి తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లోకల్, నాన్ లోకల్ అనేది గత ఎన్నకల్లో రాలేదని, నేడు ఆ వివాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇంకా ఆయనేమన్నారో చదవండి…

నాకు మీడియా ని చూస్తే భయం వేస్తోంది. మీడియా చేసే హడావుడి వల్ల మా ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నేతలే కాదు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింది. ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు. ఆరు నెలలుగా ఈ కార్యక్రమం నడుస్తోంది. మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం. ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తున్న ప్రయత్నంగా చూడాలి. మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం. ఇది మా ఆవేదన మాత్రమే. గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.

నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారు. తరువాత నేను తప్పు చేసిన బయటికి పంపిస్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో. సమస్య గురించి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారు. ఇందులో లోకల్ నాన్ లోకల్ సమస్య సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ రాలేదు. ఇప్పుడే ఎందుకు? తెలుగు అనేది గౌరవం అనేక మంది ఇతర భాషల్లో రాణిస్తున్నారు. కోర్ ప్యానెల్ కాదు. ఆవేదన తో పుట్టిన ప్యానెల్ ఇది. ఇది అవమానాలు ,కష్టాలతో పుట్టిన ప్యానెల్.