మా వివాదం పై రామ్ చరణ్ ఏమన్నారో చూడండి

మా వివాదం పై రామ్ చరణ్ ఏమన్నారో చూడండి

0
90

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది.. ఈ సమయంలో (మా) లోఉన్న విభేదాలు అక్కడ మీడియా ముఖంగా బయటపడ్డాయి. హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. దీనిపై మా పదవికి రాజశేఖర్ రాజీనామా కూడా చేశారు. అయితే ఈ వివాదం అక్కడితో ఆగిపోయింది.

తాజాగా ఈ ఘటనపై రామ్ చరణ్ తేజ్ను మీడియా ప్రశ్నించింది. ఆయన ఆయన దీనిపై సమాధానాన్ని దాట వేశారు. (మా) లోని సమస్యలను వారే పరిష్కరించుకుంటారని చెప్పారు. అలాగే, సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను సినీ పెద్దలు చూసుకుంటారని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే రామ్ చరణ్ చెప్పిన సమాధానంపై అభిమానులు సూపర్ అంటున్నారు,

అక్కడ అంత మంది పెద్దలు ఉండగా మనం మాట్లాడకూడదు అని రామ్ చరణ్ భావించి చెప్పి ఉంటారు అని అంటున్నారు అందరూ. విజయవాడలోని బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ తేజ్ ఈ విధంగా స్పందించారు. ఆయనని చూసేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడకు చేరుకున్నారు,