తమిళ హీరో విశాల్(Actor Vishal)కు మద్రాస్ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. రూ.15కోట్లు హైకోర్టులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. డిపాజిట్ చేసే వరకు విశాల్ నిర్మాణంలో వచ్చే సినిమాలను ఓటీటీ, థియేటర్లలో విడుదల చేయకూడదని ఆదేశించింది. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెలియన్ దగ్గర రూ.21.29కోట్ల రుణం తీసుకున్నాడు విశాల్. అయితే ఈ డబ్బును లైకా ప్రొడక్షన్స్ అన్బుచెళియన్‌కు చెల్లించింది. ఆ రుణం తమకు చెల్లించేవరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ హక్కులు లైకా సంస్థకే చెందుతాయని ఒప్పందం కుదర్చుకున్నారు.
అయితే తమకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా వీరమే వాగై సూడమ్ అనే సినిమాను విశాల్(Actor Vishal) విడుదల చేశాడని మద్రాస్ హైకోర్టును లైకా సంస్థ ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై గతేడాది మార్చిలో విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ రూ.15కోట్లున హైకోర్టు చీఫ్ రిజిస్ట్రార్ పేరుపై మూడు వారాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ విశాల్ వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
Read Also: అల్లు అర్జున్ నయా అవతార్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్
Follow us on: Google News, Koo, Twitter