మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన హీరోయిన్

మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన హీరోయిన్

0
45

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో తన 152 వ చిత్రం స్టార్ట్ చేశారు… ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.. కోకాపేటలో వేసిన భారీ సెట్ లో సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరుగుతోందట. ఇక కొరటాల ఈ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో దేవాదాయ ఆఫీసర్ గా చిరు కనిపించనున్నారు, మంచి యంగ్ లుక్ లో మెగాస్టార్ కనిపించనున్నారు.
ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్లో నటించాలని హీరోయిన్ రెజీనా కసండ్రను చిత్ర యూనిట్ ఇటీవల సంప్రదించింది.

కాని రెజీనా మాత్రం ఈ సాంగ్ కు నో చెప్పింది అని తెలుస్తోంది.. ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలని ఎంచుకుంటున్న రెజీనా ఈ చిత్రానికి స్పెషల్ సాంగ్ కు నో చెప్పిందట.ఈ. సినిమాను 2020 ఆగస్ట్లో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాని నిర్మాత నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ సంయుక్తంగా నిర్మాణంలో వ్యవహరిస్తున్నారు.