మంగ్లీకి బెస్ట్ ఆఫ‌ర్ మ‌రి చేస్తారా ?

మంగ్లీకి బెస్ట్ ఆఫ‌ర్ మ‌రి చేస్తారా ?

0
99

బిగ్ బాస్ సీజ‌న్ 4 గురించి తెలుగు నేల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది, ఇంత‌కీ ఇందులో ఎవ‌రు పాల్గొంటారు కంటెస్టెంట్స్ ఎవ‌రు అనేదానిపై చర్చ జ‌రుగుతోంది.త్వరలో బిగ్‌బాస్‌ 4కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతానికి బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ళ రవిని కన్ఫామ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు సింగర్‌ మంగ్లీ అలియాస్‌ సత్యవతి కూడా బిగ్‌బాస్‌కి సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇక మంగ్లీ ఫ్యాన్స్ కూడా ఈ వార్త తెలియ‌డంతో మంచి జోష్ పై ఉన్నారు, ఆమె మంచి మాట‌కారి కావ‌డంతో షోకి మ‌రింత ప్ల‌స్ అవుతుంది అంటున్నారు అంద‌రూ.

బిత్తిరి సత్తి, మంగ్లీ కాంబినేషన్‌ వీక్షకులను ఆకట్టుకుంటుందనేది షో నిర్వాహకుల ఆలోచనై ఉండొచ్చు.
అయితే ఇంకా దీనిపై ప్ర‌క‌ట‌న రాలేదు.. కాని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. వీరిద్ద‌రూ ఒకే చేస్తే ఇక ఈ సారి చాలా స‌రికొత్త‌గా షో ఉంటుంది అని చెప్ప‌వ‌చ్చు.