జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం ‘మహానటి’

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి'

0
88

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా ‘మహానటి’కి అవార్డు దక్కింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ టైటిల్‌రోల్‌ పోషించారు. సమంత, విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.