టీఆర్పీ రేటింగ్ లో మరో రికార్డు క్రియేట్ చేసిన మహానటి

టీఆర్పీ రేటింగ్ లో మరో రికార్డు క్రియేట్ చేసిన మహానటి

0
143

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ”మహానటి”. ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాక, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో సావిత్రి గారు పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దీనితో ఈ అమ్మడు కీర్తి అమాంతం పెరిగిపోయింది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జాగర్ల మూడి రాధాకృష్ణ, ప్రకాశ్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌ పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్యం వహించారు.

ఇక విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ సృష్టించిన ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెరపై కూడా రికార్డు సృష్టించింది. ఆగస్టు 19వ తేదీన ఒక టీవీలో ప్రసారం అయినా ఈ సినిమా బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది. మ‌హాన‌టి మూవీ 20.16 పాయింట్లు సాధించింది. బాహుబ‌లి2 త‌ర్వాత అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాల జాబితాలో మహానటి స్థానం సంపాదించుకుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా మహానటి సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.