అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ సినిమా లేనట్లేనా..!!

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ సినిమా లేనట్లేనా..!!

0
107

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి. ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికి , కలెక్షన్లు మాత్రం జోరుగానే ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి.

.ప్రస్తుతం మహేష్..అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమా సంక్రాంతి లో రిలీజ్ అయిపోతుంది. దీని తరువాత వంశీ తో చేసే అవకాశముందని తెలుస్తుంది. మహేష్ కు ఎవరైనా డైరెక్టర్ నచ్చితే వెంటనే అవకాశాలు ఇవ్వడం అలవాటు అలానే వంశీ కి కూడా మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం వీరు లండన్ లో క్రికెట్ మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వారాల్లో తిరిగి ఇండియాకి వీరు రానున్నారు. అలా రాగానే మహేష్..అనిల్ సినిమాలో బిజీ అయిపోతాడు. వంశీ..మహేష్ సినిమా స్క్రిప్ట్ విషయంలో బిజీ కానున్నాడు.ఇక పోతే ఇప్పట్లో సందీప్ వంగాతో సినిమా లేనట్టేనని అంటున్నారు. మహేశ్ నుంచి కబురు రాకపోవడంతో కుదిరితే మరో హిందీ మూవీ .. లేదంటే మరో హీరోతో తెలుగు సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా వున్నాడట.