విజయనిర్మల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే

విజయనిర్మల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే

0
81

ప్రముఖ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతి హైదరాబాద్ లో జరిగింది, అయితే ఆమె లేని లోటు కృష్ణ కుటుంబంలో కనిపిస్తోంది, హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలు హజరు అయ్యారు, అలాగే మహేష్ బాబు,కృష్ణంరాజు, మురళిమోహన్ కూడా హజరయ్యారు.

ముందుగా విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.విజయ నిర్మల గారు చాలా గొప్ప వ్యక్తి. నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో వారి నుంచి నాకు ఎప్పుడు ప్రశంసలు వస్తాయి..

ముందు నాన్న గారు మార్నింగ్ షో సినిమా చూస్తారు.. ఆవెంటనే సినిమా ఎలా ఉంది అనే విషయం చెబుతారు , తర్వాత ఆమె మాట్లాడుతారు, సినిమా గురించి చెబుతారు, అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఇటీవల హిట్ అయింది, అప్పుడు నాన్న గారు సినిమాచూసి నాకు ఫోన్ చేశారు, ఈ సమయంలో ఆయన తర్వాత ఆమె మాట్లాడుతారు అనుకున్నా కాని ఆమె మాట్లాడలేదు, ఆమె చనిపోయిందన్న విషయం తర్వాత గుర్తుకొచ్చింది అంటూ మహేశ్ బాబు బాధపడ్డారు.