మహేష్ బాబు అల్లు అరవింద్ బిగ్ ప్రాజెక్ట్

మహేష్ బాబు అల్లు అరవింద్ బిగ్ ప్రాజెక్ట్

0
94

టాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ బిజినెస్ ట్రెండ్ నడుస్తున్నాయి.. ఎక్కువగా జాయింట్ వెంచర్ గా సినిమాల నిర్మాణం కూడా చేస్తున్నారు…భారీ పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మిస్తున్నాయి…ఇప్పటికే యువి క్రియేషన్స్ – జీఏ2 సంస్థలు కలిసి సినిమాలు చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్ – హారిక హాసిని క్రియేషన్స్ ఇటీవల కలిసి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాయి. ఇంకా మిగిలిన వారు కూడా కలిసి సినిమాలు చేయాలి అని చూస్తున్నారు, అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ .. సురేష్ ప్రొడక్షన్స్ కూడా కలిసి చేస్తున్నాయి.

ప్రిన్స్ మహేష్ సొంత బ్యానర్ జీఎంబీ ఇతర అగ్ర బ్యానర్లతో కలిసి సినిమాలు చేస్తోంది. వచ్చే రోజుల్లో గీతా ఆర్ట్స్ తో మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కలిసి కొన్ని సినిమాలు చేయనుందట… ముందు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి వర్క్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబుకి అల్లు అరవింద్ కు ఈ స్టోరీ నచ్చడంతో ఈ చిత్రం చేయాలి అని చూస్తున్నారు, ఇక కేజీఎఫ్ 2 తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేస్తారట మహేష్ బాబు. ఈలోగానే మహేష్ హీరోగా వంశీ పైడిపల్లితో సినిమా పూర్తవుతుంది. అటు పై మహేష్ 28 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది సో ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.