మహేష్ బాబు సినిమాతో టికెట్ వెబ్ సైట్ల కి పండుగ

మహేష్ బాబు సినిమాతో టికెట్ వెబ్ సైట్ల కి పండుగ

0
86

సినిమా తొలిరోజు కలెక్షన్లు అనేవి గతంలో రాత్రికి లెక్క వచ్చేది.. కాని ఇప్పుడు అంతా టికెట్స్ ఆన్ లైన్ సెల్లింగ్ ప్రకారం జరుగుతోంది.. అందుకే తొలి రోజు మధ్యలోనే లెక్క వచ్చేస్తోంది. రెండు మూడు షోలకే మొత్తం రిపోర్ట్ తేలిపోతుంది, అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ టాక్ రావడంతో టికెట్స్ కూడా వచ్చే ఆరు రోజుల వరకూ సైట్లలో కూడా కనిపించడం లేదు, దాదాపు తొలిరోజు ఆయన సినిమా వసూళ్లు 55 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.

అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం మూడు రోజులు పండుగకు ముందే విడుదల అయింది.. అయితే ఈ మూడు రోజులు, అలాగే వచ్చేవారం పండుగ మూడు రోజులు మొత్తం ఆరు రోజులుకలిపి ఇదే రేంజ్ లో వసూళ్లు కొనసాగితే, వీకెండ్ ఎండింగ్ కు 220 కోట్ల వరకూ వస్తాయి అని అంటున్నారు. అయితే ఇప్పటికే ఆన్ లైన్ టికెట్స్ ద్వారా ఇప్పటి వరకూ దాదాపు నాలుగురోజులకి 80 కోట్ల రూపాయల మార్కెట్ జరిగింది అని వార్తలు వస్తున్నాయి.

దాదాపు మూడు సైట్ల ద్వారా టికెట్స్ మార్కెట్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ సంక్రాంతి బిజినెస్ లో మహేష్ బాబు సినిమాగా, ఇది రికార్డు దుమ్ముదులిపేసింది అని తెలుస్తోంది.. అయితే టికెట్స్ కూడా ఫుల్ బుక్ అయ్యాయట.. మార్కెట్ ప్రకారం 80 కోట్ల రూపాయలు టికెట్స్ బుక్ అయ్యాయి అని చెబుతున్నారు. ఈ వారం రోజులకి కలెక్షన్స్ ఏం రేంజులో ఉంటాయో చూసుకోవచ్చు.