మహేశ్‌బాబు మహర్షి మూవీ కొత్త లుక్

మహేశ్‌బాబు మహర్షి మూవీ కొత్త లుక్

0
96

ప్రిన్స్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .తాజాగా నమ్రత మహర్షి షూటింగ్ స్పాట్ లో మహేష్ ఉన్న కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు. మహేష్ లుక్ అదిరిపోయింది..అశ్వినీదత్,దిల్‌ రాజు,పీవీపీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రిషి పాత్రలో మహేష్ నటిస్తుండగా..రవి పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు..ఇక హాట్ బ్యూటీ పూజా హెగ్డే మహేష్‌కు జోడీగా నటిస్తోంది.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్‌కు సంబంధించి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట నిర్మాతలకు.దీంతో శాటిలైట్ రైట్స్ నుంచి ఓవర్సీస్ దాకా మహేష్ కెరీర్‌లోనే బెస్ట్ వచ్చేలా టార్గెట్ సెట్ చేసుకుని మరీ డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ని మే 9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల తీసుకురాబోతున్నారు.