మహేష్ బాబు – పరశురాం టైటిల్ ఇదేనా ? రివీల్ ఎప్పుడు ?

మహేష్ బాబు - పరశురాం టైటిల్ ఇదేనా ? రివీల్ ఎప్పుడు ?

0
102

ప్రిన్స్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ డిఫరెంట్ సబ్జెక్ట్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి మ్యాజిక్ చేశాడు. అయితే మరి తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేదాని గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వంశీతో సినిమా అన్నారు కాని దానిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు.

ఇక వైరస్ లాక్ డౌన్ తో రెండు నెలలుగా షూటింగులు ఆగిపోయాయి, తాజాగా మహేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ వచ్చింది. ఈనెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా తన తండ్రికి గిఫ్ట్ గా ఈ మూవీని లాంఛనంగా స్టార్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, అభిమానులు కూడా ఏం స్పెషల్ చెబుతారా అని చూస్తున్నారు.

ఇక దర్శకుడు పరశురామ్ మహేష్ తో తదుపరి చిత్రం చేయనున్నారట. సర్కార్ వారి పాట అని టైటిల్
పెట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ అయితే రానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత గీత గోవిందం మూవీ తర్వాత పరశురాం చేస్తున్న సినిమా ఇది.