మహేశ్​బాబు- రాజమౌళి మూవీ..హీరోయిన్ గా ‘RRR’ బ్యూటీ

0
103

మహేశ్​బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత త్రివిక్రమ్, రాజమౌళి, వంశీ పైడిపల్లి వంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేయనున్నాడు ప్రిన్స్. మహేశ్​బాబు- రాజమౌళి కాంబినేషన్​లో చిత్రం కోసం అటు మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

తెలుగుతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతుందని ఇటీవల మహేశ్​ బాబు కూడా చెప్పారు. అయితే ‘ఆర్​ఆర్​ఆర్​’ తర్వాత తన సినిమా మహేశ్​తోనే ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు. తాజాగా రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వచ్చే సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ భారీ బడ్జెట్​ చిత్రంలో మహేశ్​ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన బాలీవుడ్ ఎంట్రీపై మహేశ్ ఇటీవల స్పందించారు. “నేనెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తాను. హిందీలో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం. నా తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నా. ఇది అన్ని భాషల్లో ఉంటుంది” అని మహేశ్​బాబు, ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమధానమిస్తూ ఇలా చెప్పారు.