సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం ఈ ఏడాది ఈ గుడ్ న్యూస్ వినచ్చు అంటున్నారు… కొన్ని కారణాలు చెబుతున్నారు, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత మరే సినిమా చేస్తారో అనేది ఇంకా ప్రకటించలేదు.. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రం చేస్తున్నారు.. ఇక ఆయన కూడా ఈ చిత్రం తర్వాత ఏ సినిమా అనేది చెప్పలేదు… ఇక మహేష్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది.
ఆ తర్వాత రాజమౌళితోనే మహేష్ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో…అంతేకాదు ఇక ఆర్ఆర్ఆర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకుని మహేష్ సినిమా అనౌన్స్ చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి …ఇదే నిజం అయితే చాలా ఆనందం అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్ .