మహేష్ బాబు సర్కారువారి పాట తర్వాత ఏ సినిమా చేస్తారంటే

మహేష్ బాబు సర్కారువారి పాట తర్వాత ఏ సినిమా చేస్తారంటే

0
112

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు చేశారు… ఇక అదే జోరుతో సర్కారు వారి పాట సినిమాని అనౌన్స్ చేశారు.. ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఇక మే తర్వాత దీనిని విడుదల చేసే అవకాశం ఉంది, ఇక మహేష్ బాబు కూడా ఈ లాక్ డౌన్ సమయంలో పలు కథలు విన్నారు.

మరి సర్కారువారి పాట సినిమా తర్వాత మహేష్ ఏం సినిమా చేయనునన్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే మహేష్, అనిల్ రావిపుడి కాంబోలో ఓ చిత్రం చేస్తారు అని టాలీవుడ్ టాక్, అయితే ఈలోపు ఎఫ్ 3 పూర్తి చేస్తే ఆయన మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు.

సరిలేరునీకెవ్వరు సమయంలో మహేష్ ఇంకో సినిమా చేస్తానని అనిల్ కు మాట ఇచ్చారట, అయితే ఎఫ్ 3 పూర్తి అయితే మహేష్ తో ఆయన సినిమా చేసి అది కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు అనిల్ , అయితే సినిమా కథ కూడా వర్క్ అయింది అని టాక్ నడుస్తోంది. వేగంగా సినిమా పూర్తి చేయాలి అంటే అనిల్ రావిపూడి కరెక్ట్ అని మహేష్ కూడా భావిస్తున్నారట.