విదేశాలకు మహేష్ బాబు షెడ్యూల్ అదిరింది

విదేశాలకు మహేష్ బాబు షెడ్యూల్ అదిరింది

0
90

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు.. చిత్రయూనిట్ ఇప్పటికే చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తాము అని కూడా ప్రకటించేసింది. ఇక కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఉంది.. ఇక మండే అందరికి ఫన్ డే లా మహేష్ సినిమా పాటలు వచ్చే వారం నుంచి సోమవారం ఒక్కో పాట విడుదల అవుతాయి.. డిసెంబరులో అభిమానులకు పండుగే , అలాగే జనవరి 1న ట్రైలర్ జనవరి 5న ప్రి రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది అని అందరూ భావిస్తున్నారు.. కాని మరో 20 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది అని తెలుస్తోంది. ఒక పాట చిత్రీకరణ కోసం మహేష్ బాబు ఫారెన్ వెళ్లనున్నారట . మిగిలిన షూటింగ్ అంతా హైదరాబాద్ బెంగళూరులో జరుగుతుంది అని తెలుస్తోంది.

డిసెంబర్ 20 లోపే సినిమా వర్క్ అంతా పూర్తయిపోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఫ్రీ అవ్వనుంది. ఇప్పటికే పబ్లిసీటి కోసం టీమ్ ప్లాన్ చేస్తోంది.. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది సరిలేరు నీకెవ్వరూ.. సో మహేష్ కు మరో 20 రోజులు ఆయన షెడ్యూల్ ఫుల్ బిజీ అనే అనుకోవాలి.