బిగ్ బాస్‌లోకి మహేష్ బాబు మరదలు?

-

బిగ్ బాస్ రియాల్టీ షో తొలి సీజన్ నుంచే ప్రేక్షకులను ఆకర్షించడంలో తన మార్క్ చూపించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో కూడా ఈ షోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుండగా తెలుగులో 8వ సీజన్ నడుస్తోంది. ప్రతి భాషలో కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి అనేక మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ లిస్ట్ తాజాగా కనిపిస్తున్న ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే.. శిల్ప శిరోద్కర్(Shilpa Shirodkar). ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్( Namrata Shirodkar) సోదరి కావడమే ఈ పేరు చర్చల్లో నిలవడానికి ప్రధాన కారణం. మహేష్ బాబు మరదలు.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

- Advertisement -

ఎవరీ శిల్ప శిరోద్కర్..

శిల్ప శిరోద్కర్.. నమ్రత చెల్లెలు కావడమే కాకుండా పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. 1989లో వచ్చి భ్రష్టాచార్ సినిమాతో శిల్ప తన సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖేన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది. పెళ్ళి తర్వాత కెమెరా ముందుకు రావడం ఆపేసిన శిల్ప(Shilpa Shirodkar).. దాదాపు పదేళ్ల తర్వాత 2013లో మళ్ళీ సీరియల్స్‌తో సిల్వర్ స్కీన్‌పై తలుక్కుమంది. ఇప్పుడు బిగ్ బాస్‌ షోతో బుల్లితెరపై కూడా తన మార్క్ చూపనుందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూడాలి.

Read Also: నిద్రే నిద్ర వస్తుందా.. కారణాలు ఇవేనేమో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...