మహేశ్ బాబు గర్వపడే పనిచేసిన కుమారుడు గౌతమ్!

-

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేవలం సినిమాలతోనే కాకుండా సామాజిక సేవలతోనూ ఆయన ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపిస్తూ గొప్ప మనసు చాటుకుంటుంటాడు. ఇదిలా ఉండగా.. హఠాత్తుగా మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ వార్తల్లో నిలిచాడు.

- Advertisement -

తాజాగా గుండె ఆపరేషన్‌ చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రికి వెళ్లి పలకరించాడు గౌతమ్. వాళ్లలో మనోధైర్యాన్ని నింపుతున్నాడు. దీనికి సంబంధిత ఫొటోలను మహేశ్ బాబు భార్య, గౌతమ్ తల్లి అయిన నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసి భావోద్వేగానిరి లోనయ్యారు. చికిత్స తీసుకుంటున్న ఓ చిన్నారితో గౌతమ్‌ ఉన్న ఫొటోను నమ్రత షేర్‌ చేశారు. ఆపరేషన్‌ చేయించుకున్న చిన్నారులను కలవడానికి గౌతమ్‌ రెయిన్‌ బో ఆసుపత్రికి వెళ్తుంటాడని నమ్రత చెప్పారు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు మహేశ్‌ ఫౌండేషన్‌ పేరుతో గుండె ఆపరేషన్లు చేయించినట్లు ఆమె తెలిపారు. గౌతమ్‌ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం జిల్లా పర్యటనలో...

Formula E Car Race Case | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race...