సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ సినిమా మరికొన్ని గంటల్లోనే థియేటర్లలోకి రానుంది. దీంతో అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయగా.. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మహేష్ డ్యాన్స్, లుక్, ఎనర్జీ చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బాబు దెబ్బకు థియేటర్లు మోత మోగాల్సిందేని.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ కావాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి గుంటూరులో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ “ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని” చెబుతూ తీవ్ర భావోద్వేగానికి అయ్యారు.
డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) మాట్లాడుతూ “తెలుగు ఇండస్ట్రీలో నటన విషయంలో 200శాతం మహేష్(Mahesh Babu)ను కొట్టేవారు లేరు” చెప్పడం అభిమానులను జోష్‌లో నింపింది. అలాగే దిల్ రాజు మాట్లాడుతూ “మహేష్ బాబు ఈ సినిమా కలెక్షన్స్‌తో తాట తీస్తాడు. ఇందులో మహేష్ క్యారెక్టర్ పోకిరి, దూకుడు సినిమాల్లో చాలా మాస్‌గా ఉంటుంది” అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ(Ramya Krishna), తండ్రిగా జయరామ్, విలన్‌గా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా మూవీ(Guntur Kaaram) విడుదల కానుంది.