సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ మూవీ ఇటీవల విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట లిరికల్ వీడియోకి 101 మిలియన్లకి పైగా వ్యూస్ రాగా.. ఒరిజినల్ వీడియో సాంగ్‌కి 57 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఈ పాటలో మహేష్, శ్రీలీల డ్యాన్స్ అయితే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
తాజాగా మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు భారతి కూడా ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ రీల్ చేసింది. ఇందులో ఆమె డ్యాన్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తోంది. దీనిపై మహేష్ కూతురు సితార కూడా మెచ్చుకుంటూ కామెంట్లు కూడా చేసింది. ఇక మహేష్(Mahesh Babu) కూడా ఈ వీడియోకు లైక్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే దివంగత కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు కూడా పలు సినిమాల్లో హీరోగా నటించారు. అయితే అనారోగ్య సమస్యలతో 2022లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు జయకృష్ణ(Jayakrishna), కూతరు భారతి(Bharathi) ఉన్నారు. వీరి గురించి పెద్దగా బయట ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాతో కుమార్తె భారతి యాక్టివ్ అవుతూ కనిపిస్తోంది. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టా బయోలో ‘Drive in Cinema’ అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన ఘట్టమనేని ఫ్యాన్స్ మరో వారసురాలు సినిమాల్లోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: భార్యాభర్తల మధ్య ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!