మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు అలాగే బన్నీ అల వైకుంఠపురంలో చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి… అయితే డేట్స్ ప్రకారం చూసుకుంటే ముందు సరిలేరు నీకెవ్వరు చిత్రం 11వ తేదిన అలాగే అల వైకుంఠపురంలో 12వ తేదిన విడుదల చేయాలి అని ప్లాన్ వేసుకున్నారు.
కాని రెండు సినిమాల్లో ఇప్పుడు విడుదల తేదీలో మార్పులు ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి, త్రివిక్రమ్ బన్నీ సినిమా అల వైకుంఠపురంలో ఈనెల 10న విడుదల చేయాలి అని చూస్తున్నారు,, దీంతో సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా పదవ తేదినే విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నారట.
అయితే సంక్రాంతి సమయంలో రెండు సినిమాలు కచ్చితంగా చూస్తారు అభిమానులు.. అయితే ధియేటర్స్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది ..ముందు విడుదల అయిన సినిమాకి హిట్ టాక్ వస్తే ధియేటర్స్ కు ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ముందు ఎవరు రిలీజ్ చేస్తారా అని అభిమానులు కూడా చూస్తున్నారు.