సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సందడి చేశాడు మహేష్ బాబు, అంతేకాదు ఈ సినిమాపై ముందు నుంచి ఆశలు పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మంచి విజయం ఆయన ఖాతాలో వేసుకున్నారు ..ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లతో దుమ్ముదులిపేస్తోంది, అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా తీసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాని బాలీవుడ్ లో ఇద్దరు హీరోలు ఓ బడా నిర్మాత కలిసి చూశారట.. ఈ సినిమా ధీమ్ బాగుంది అని అన్నారట.. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చేలా ఈ కథ ఉండటంతో ఈ సినిమాకి నేరుగా హక్కులు తీసుకోవాలా లేదా అదే దర్శకుడు నిర్మాతతో సినిమా చేయాలా అని చూస్తున్నారట .. అంతేకాదు ఈ కథ కనెక్టివిటీ నార్త్ ఇండియన్ అభిమానులకి కూడా నచ్చేలా ఉంది. అయితే ఇందులో కొన్ని సీన్స్ మినహా మిగిలింది అంతా సినిమాలో హైప్ వస్తుంది అని భావిస్తున్నారట.
ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ సినిమా పై ఆశలు పెట్టుకుంది.. త్వరలో బాలీవుడ్ నుంచి బడా ప్రొడ్యుసర్ ఈ సినిమా హక్కులు తీసుకుంటారట.. అయితే వారి మదిలో ఈ సినిమా ఎవరు చేస్తారు అనేది ఉంది.. కాని ఈ చిత్రం ఏ హీరో చేస్తారు అనేది మాత్రం బయటపెట్టరట.. మొత్తానికి ప్రిన్స్ సినిమాలకు మార్కెట్ చాలా చోట్ల ఉన్న విషయం తెలిసిందే.