ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్లుగా సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్గా లావణ్యను ఎంపిక చేసినట్లుగా టాక్.
గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో మళ్లీ వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చాలా కాలంగా హిట్ లేకుండా ఉన్న లావణ్యకు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.