మహేష్ కోసం సరికొత్తగా డీఎస్పీ సాంగ్

మహేష్ కోసం సరికొత్తగా డీఎస్పీ సాంగ్

0
131

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ వస్తోంది ..ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. సినిమాకి సంబంధించి సాంగ్స్ కూడా వీక్ కి ఒకసాంగ్ రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం టైటిల్ సాంగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా… జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు అంటూ సాగే ఈ పాటను రాసింది దేవిశ్రీప్రసాదే. కాగా, ఈ టైటిల్ సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ విదేశీ సంగీత వాద్యకారుల బృందంపై ఆధారపడ్డారు. దీని గురించి పూర్తి లైవ్ రికార్డింగ్ చేశారు..

ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ తో పాటలు రికార్డు చేస్తున్న ఈ కాలంలో దేవీ శ్రీ ఇలా లైవ్ రికార్డింగ్ చేయడం పట్ల అందరూ సూపర్ అంటున్నారు, దేవీకి అభినందనలు ఇస్తున్నారు. ఈ పాట చిత్రానికి హైలెట్ అవుతుంది అంటున్నారు