సరికొత్త పాత్రలో మహేష్ మళ్లీ రిపీట్

సరికొత్త పాత్రలో మహేష్ మళ్లీ రిపీట్

0
99

భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరు నీకెవ్వరు చిత్రాలు వరుసగా హ్యాట్రిక్ కొట్టారు ప్రిన్స్ మహేష్ బాబు, ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.. త్వరలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని తెలుస్తోంది.

అయితే ఇందులో గతంలో చేసిన పాత్ర చేసేలా ఉన్నారు అని తెలుస్తోంది, ఆయన స్పై పాత్రలో నటించనున్నారట, గతంలో ఇలాంటి సినిమా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చేశారు, అయితే మళ్లీ వంశీ చిత్రంలో స్పై గా నటించనున్నారు అని తెలుస్తోంది.

కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 27వ సినిమా .. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారట.ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరన రిలీజ్ చేస్తారా లేదా సంక్రాంతి బరిలోకి దిగుతుందా అనేది చూడాలి..