సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

0
94

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కుతోంది.. ఆ చిత్రమే సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు అయితే సినిమాపై విపరీతమైన బజ్ అయితే మార్కెట్లో వచ్చింది, ఇక సినిమాకి సంబంధించి పాటలు మార్కెట్లో షేక్ చేస్తున్నాయి. ఇక ప్రిన్స్ ఇందులో ఎలా నటించారు అనేది చూడాలి అని వెండితెరపై చిత్రం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల ముందస్తు వేడుకను జనవరి 5న నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే జనవరి 2 లేదా 3 అనుకున్న డేట్ చివరకు 5 కు వెళ్లింది, దీంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఈ వేడుకకి హైదరాబాద్లోని ఎల్.బి.స్టేడియం వేదిక కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్కు మంచి స్పందన వస్తోంది. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం అప్పుడే అభిమానులు ప్లాన్స్ వేసుకుంటున్నారు సినిమాకి వారం ముందు ఈ వెంట్ పెడుతోంది చిత్ర యూనిట్.