మహేష్ రాజమౌళి సినిమా ప్రకటన ఆరోజే వస్తుందా ?

మహేష్ రాజమౌళి సినిమా ప్రకటన ఆరోజే వస్తుందా ?

0
90

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి… అయితే రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..దుర్గాష్టమి రోజు ఈ చిత్రం విడుదల చేయనున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

అయితే కరోనా వల్ల డేట్ మారుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము… అయితే అందరూ కూడా తర్వాత ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు… తాజాగా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది… అయితే దీనిపై అఫీషియల్ గాఎక్కడా ఎలాంటి ప్రకటన రాలేదు… అయితే ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు.

 

శివాజీ గెటప్ లో కృష్ణ తనకి తిరుగులేదనిపించుకున్నారు.ఇక ఇప్పుడు మహేష్ బాబు ఈ పాత్ర చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి స్టోరీ ఇదేనా మరో స్టోరీనా అనేది ఇంకా చెప్పలేము.. అయితే టాలీవుడ్ వార్తల ప్రకారం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారనే వార్త వినిపిస్తోంది , ఇది జరిగితే అభిమానులకి పండుగ అనే చెప్పాలి.