మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మంచి సక్సెస్ లో ఉన్నారు, అయితే మూడు నెలల సమయం తీసుకున్నా మంచి టైటిల్ తో ఓ గుడ్ సినిమా అనౌన్స్ చేశారు, అదే సర్కారు వారి పాట.
పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేయనున్నారు ప్రిన్స్.
ఇటీవల రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాలో మహేష్ బాబుకు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌తో పాటు ఉపేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు.
అయితే బీ టౌన్ నుంచి కూడా పలువురి పేర్లు పరిశీలించారట, కాని తాజాగా సుదీప్ లేదా ఉపేంద్ర ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు అని తెలుస్తోంది, సుదీప్ పేరు బాగా వినిపిస్తోంది, ఇందులో మహేష్ త్రిపాత్రాభినయం అని అంటున్నారు, సో ఏదైనా చిత్ర యూనిట్ ప్రకటించే వరకూ అభిమానులు ఆగాల్సిందే.