మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా

మహేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా

0
73

ప్రిన్స్ మహేష్ బాబు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ స్టోరీని ఫైనల్ చేస్తారు… అందుకే ఆయనకు చాలా హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉంటాయి… ఇక తాజాగా ఆయన సర్కారువారి పాట చిత్రం చేస్తున్నారు.. ఈ సినిమాకి దర్శకుడు పరశురామ్, అయితే ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు.

 

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.. అయితే ఈ సినిమాకి ఈ టైటిల్ పెడుతున్నారు అనే వార్త అయితే టాలీవుడ్ లో వినిపిస్తోంది.

 

పార్థు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇందులో మహేష్ ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో వ్యక్తిగా నటిస్తారట, ఇక తర్వాత అతని తండ్రి ఓ పెద్ద డాన్ అని తెలుస్తుందట, ఇక అతనితో తలపడతాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని కోసం బాలీవుడ్ నటుడిని అతని తండ్రి పాత్రకు తీసుకుంటారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.