45 డేస్ అమెరికాలో మహేష్ బాబు ఎందుకో తెలుసా…

45 డేస్ అమెరికాలో మహేష్ బాబు ఎందుకో తెలుసా...

0
95

తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు… ఇప్పటికే భరత్ అనునేను, మహర్షి సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మహేష్ తను నెక్ట్స్ మూవీని దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేశారు…

సర్కారు వారి పాట టైటిల్ ని ఫిక్స్ చేశారు… ఈ చిత్రంలో మహేష్ బాబుకు హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి అయితే ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.. ఇది ఇలా ఉంటే నవంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే కథ కావడంతో షూటింగ్ అమెరికాలో చేయనున్నారు… అక్కడ 45 రోజులు షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి నెలల తిరిగి ఇండియాకు వస్తారట… కాగా వచ్చే విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు…