మహేష్ బాబు బ్యానర్లో నవీన్ పోలిశెట్టి సినిమా మరి దర్శకుడు ఎవరంటే ?

మహేష్ బాబు బ్యానర్లో నవీన్ పోలిశెట్టి సినిమా మరి దర్శకుడు ఎవరంటే ?

0
85

నవీన్ పోలిశెట్టి తెలుగు సినిమా అభిమానులు ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా ఈయన గురించి మాట్లాడుతున్నారు.. ముఖ్యంగా జాతి రత్నాల సినిమా గురించి … థియేటర్లో కూర్చున్నంత సేపు ఈ సినిమా గురించి నవ్వుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ సినిమా చాలా అద్బుతంగా ఉంది.. కామెడీ నటన అమోఘం అందుకే టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు

ఈ సినిమా హీరో అతని ఫ్రెండ్స్ అలాగే దర్శకుడిని అభినందిస్తున్నారు.

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా ఆయనకు మంచి సక్సెస్ ఇచ్చింది… ఇక తాజాగా చాలా అవకాశాలు వస్తున్నాయి, అయితే ఇప్పుడు ఓ సూపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ టాక్ నడుస్తోంది…మహేశ్ బాబు సొంత బ్యానర్ లో నవీన్ తో సినిమా చేయాలి అని చూస్తున్నారట.

 

ఇటీవల ప్రిన్స్ మహేశ్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే . తన సినిమాల నిర్మాణంలో భాగస్వామిగానే కాకుండా, ఇతర హీరోలతోను ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు… మేజర్ కూడా ఇలా తీస్తున్న సినిమా… ఇక తాజాగా నవీన్ పొలిశెట్టితో సినిమా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి… ఈ సినిమాకి దర్శకుడు వెంకి కుడుముల అని టాక్ నడుస్తోంది…ఇక అభిమానులు ఈ వార్త విని సూపర్ ఖుషీగా ఉన్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.