సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం భరత్ అనునేను ఈ చిత్రం సూపర్ హీట్ అయిన సంగతి తెలిసిందే… ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కియారా అద్వానీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ తర్వాత రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయరామ చిత్రంలో నటించింది…
దాని తర్వాత టాలీవుడ్ బోర్ కొట్టిందో ఏమో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసింది… బాలీవుడ్ లో కభీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టింది… దీంతో ఈ బామ్మ తెలుగు సినిమాలను సైడ్ చేసింది… అక్కడ వరుస చిత్రాలను చేస్తోంది..
అయితే కియారాను ఫస్ట్ ప్రిఫరెన్స్ గా బాలీవుడ్ మేకర్స్ చూడలేకపోతున్నారట… అందుకే ఈచిన్నది బాలీవుడ్ ను నమ్ముకుంటేకష్టమని సౌత్ ను ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… మరి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన ఈ ముద్దుగుమ్మకు ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి