మహాభారతంలో మహేష్

మహాభారతంలో మహేష్

0
90

సంచలన దర్శకుడు రాజమౌళి రూపాయలు 450 కోట్ల బడ్జెట్ తో ఆర్ అర్ అర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా సమయం పడుతుంది ఇదిలా ఉంటే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ సినిమా లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నరని వార్తలు. అయితే ఈ సినిమాలో ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్ తో పాటు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న రానా కూడా నటించనున్నారు అని అంటున్నారు మహాభారతం రాజమౌళికి డ్రీమ్ ప్రాజెక్ట్.

అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కు మహాభారతం వెబ్ సిరీస్ గా అందించాలని అనుకోవడంతో జక్కన్న తన ఆలోచననీ పక్కన పెట్టేసారు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా తన ఆలోచన విరమించుకోవడం తో మళ్లీ రాజమౌళి ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాని ఇప్పటివరకు కనీవిని ఎరగని బడ్జెట్తో తెరకెక్కించినున్నరని టాక్ . సినిమా ప్రాజెక్టు ప్లానింగ్ అంటే కేవలం అనుకోని అందుబాటులో ఉన్న వాళ్ళతో తీసేయడం కాదు మార్కెటింగ్ వరకు కూడా ఆలోచిస్తాడు మన జక్కన్న.

అయితే ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుని అల్లూరి సీతారామరాజుగా కంటే జేమ్స్ బాండ్ గా చూడడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. గతంలో మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఫిక్స్ అయిందని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు తో రాజమౌళి చేయబోతున్నారని అన్నారు. ఇది కేవలం బాలీవుడ్ ని మాత్రమే కాకుండా హాలీవుడ్ ని టార్గెట్ చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎది ఏమైనా జక్కన్న విత్ మహేష్ బాబు పిక్స్ కానీ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.