మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్ సెలక్ట్…

మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్ సెలక్ట్...

0
88

1990లో హీరోలుగా ఫుల్ పాపులర్ తెచ్చుకున్న కొందరు నటులు ఇప్పుడు తమ సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి తమ సత్తా చాటుతున్నారు… మరికొందరు అయితే ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్నారు… నేటి తరం యంగ్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వారిలో హీరో అనిల్ కపూర్ ఒకరు…

ఒకప్పుడు బాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్న అనిల్ కపూర్ ఇప్పుడు యంగ్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నాడు… తాజాగా ఈయన గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… వరుసగా హ్యాట్రిక్ విజయాలు సొంత చేసుకున్న సుపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు పరుశురాంతో చేస్తున్నారు… ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే…

బ్యాంక్ మోసాలు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విలన్ పాత్ర కీలకం అందుకే ఈ పాత్రలో అనిల్ కపూర్ ను ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి.. అంతేకాదు ఆయనతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి…