వరుస హిట్ లతో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరునీకెవ్వరు అనే సినిమా లో నటిస్తున్నాడు.. కామెడీ నేపథ్యంలో కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా నటిస్తోంది.
అయితే ఇప్పుడు ఈ ముగ్గురు నైజాం,విశాఖ మరియు గోదావరి జిల్లాలలో తమ సొంత బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటున్నారని తెలుస్తుంది.ఈ మూడు చోట్ల మినహా ఇంకా ఈ చిత్రం 70 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం.మరి ఈ మిగతా 70 కోట్లు అనేది ఒక్క తెలుగు రాష్ట్రలోనేనా లేక ప్రపంచ వ్యాప్తంగానా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు అభిమానులలో పెద్ద హాట్ టాపిక్ అయింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా మహేష్ అభిమానులకు అంచనాలు చాలానే ఉన్నాయి.