నెక్ట్స్ మ‌హేష్ బాబు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తారా?

నెక్ట్స్ మ‌హేష్ బాబు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తారా?

0
92

మ‌హేష్ బాబు తాజాగా ప‌ర‌శురాం డైరెక్ష‌న్లో సినిమా చేస్తున్నారు, పెద్ద గ్యాప్ లేకుండా స్టార్ హీరోలు సినిమాలు చేస్తారు అనేది తెలిసిందే, అయితే ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వాత మ‌హేష్ ఈ స్టోరిని చేస్తున్నారు, ఈ కోవిడ్ కార‌ణంగా చాలా స‌మ‌యం ఆల‌స్యం అయింది.

పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్న మహేశ్.. తన తదుపరి చిత్రం పై కూడా ఫోక‌స్ చేశార‌ట‌, అయితే వ‌రుస‌గా ఆయ‌న క‌థ‌లు వింటున్నారు అని తెలుస్తోంది, తాజాగా వినిపిస్తున్న వార్త‌లు ప్ర‌కారం.

లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లువురు ద‌ర్శ‌కులు ఆయ‌న‌కు క‌థ‌లు వినిపించార‌ట‌, అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మళ్లీ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయ‌న చెప్పిన క‌థ న‌చ్చింద‌ట‌, త్వ‌ర‌లో దీనిపై ప్ర‌క‌ట‌న రానుంది అని తెలుస్తోంది.