మహేష్ బాబు ఫోటో షూట్ తొక్కిసలాట అసలు ఏం జరిగిందంటే

మహేష్ బాబు ఫోటో షూట్ తొక్కిసలాట అసలు ఏం జరిగిందంటే

0
96

సినిమా హీరోలు వస్తున్నారు అంటే అభిమానులు ఏ రేంజ్ లో వస్తారో తెలిసిందే, అంతేకాదు పెద్ద పెద్ద సెట్స్ వేసిన సమయంలో షూటింగ్ జరుగుతుంది అని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు, అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో మహేష్ కూడా కాస్త రిలాక్స్ అయ్యారు.

తాజాగా హీరో మహేశ్ బాబుతో ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫొటో షూట్ లో తొక్కిసలాట జరిగింది అనే వార్త నేడు తెలుగు స్టేట్స్ లో షాకింగ్ వార్త అయింది . హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో ఈ ఫొటో షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయనని చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు.

గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సమాచారమిచ్చింది.అయితే సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని కొందరు అంటుంటే అసలు ఇంత మంది క్రౌడ్ వస్తారు అని ఊహించలేదు అని ఆ సంస్ద చెబుతోంది .. ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.