చిన్ననాటి ఫోటోను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన ప్రిన్స్

చిన్ననాటి ఫోటోను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన ప్రిన్స్

0
113

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర పోషిస్తూన్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చాలా ఎళ్లా తర్వాత లేడీ మేగస్టార్ విజయశాంతి కెమెరా ముందుకు రావడంతో ఈ సినిమాపై అభిమానులకు ఆసక్తి పెరిగింది. కాగా, విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు.

1989లో ’కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ ఆమెతో పాటు తాను కూడా నటించానని వెల్లడించారు. మొదటి సారిగా ఈ సినిమాలోనే విజయశాంతి గారితో నటించడం జరిగిందని వివరించారు. మళ్లీ 30 ఏళ్ల తర్వాత విజయశాంతి గారితో నటిస్తుండడం చూస్తుంటే కాలచక్రం గిర్రున తిరిగివచ్చిందన్న ఫీలింగ్ కలుగుతోందని మహేష్ ట్వీట్ చేశారు. అంతేగాకుం డా, ఆమెతో దిగిన తన చిన్నప్పటి ఫొటోను కూడా ట్వీట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు మహేష్.