మజిలీ భామకు సరికొత్త ఆఫర్ ఫుల్ హ్యపీ

మజిలీ భామకు సరికొత్త ఆఫర్ ఫుల్ హ్యపీ

0
91

ఇటీవల వచ్చిన సినిమాల్లో క్లాసికల్ హిట్ అయిన చిత్రం అంటే మజిలీ అనే చెప్పాలి… ఈ సినిమా అందరి మనసులు దోచింది అంతేకాదు
దివ్యాన్ష కౌశిక్ నటనకు అందరూ ముగ్దులు అయ్యారు. ఇందులో ఆమె నటన చాలా సహజంగా ఉంది.. అయితే ఆ సినిమా హిట్ సమంత ఖాతాలో పడిపోయింది. ఆ కారణంగా దివ్యాన్షను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కొంతకాలం పాటు వేచి చూసిన ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

అయితే ఇలా నటన బాగున్నా సీనియర్ హీరోయిన్స్ ఉంటే వారికే క్రెడిట్ దక్కుతుంది. సో అందుకే ఈ సినిమాలో సమంతకు ఎక్కువ క్రెడిట్ దక్కింది. తాజాగా ఆమెకి టక్కర్ సినిమాలో ఛాన్స్ తగిలింది. సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. ముందు నుంచి ఈ చిత్రానికి వేరే నటి అనుకున్నారు కాని చివరగా దివ్యాన్ష ని సెలక్ట్ చేశారు.

అంతేకాదు కోలీవుడ్లో తాను నిలదొక్కుకుంటాననే ఆశతో ఈ అమ్మాయి ఉందట. అయితే ఆమెకు మరో గుడ్ న్యూస్ ఏమిటి అంటే సిద్దార్డ్ సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా కూడా తెలుగులో విడుదల చేస్తారు అని తెలుస్తోంది దీంతో ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటోంది.