Kantara Chapter 1 | ఎదురు చూపులకు చెక్.. కాంతార ప్రీక్వెల్ వచ్చేదప్పుడే..

-

Kantara Chapter 1 |పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి యావత్ దేశ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన సినిమా ‘కాంతార’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మూవీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తమ కల్చర్‌ను చూపించడంలో రిషబ్ శెట్టి(Rishab Shetty) తన మార్క్‌ చూపించాడని, చాలా అద్భుతంగా తమ కల్చర్‌ను ప్రెజెంట్ చేశాడంటూ హీరో, దర్శకుడు రిషబ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఈ సినిమా సీక్వెల్ కావాలంటూ డిమాండ్ చేయడం కూడా మొదలు పెట్టారు. అదే విధంగా కాంతార పార్ట్ 2 తప్పకుండా ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించారు. అంతేకాకుండా ఇది సీక్వెల్ కాదని, కాంతార పార్ట్ 2.. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రానుందని మూవీ టీమ్ స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా ప్రీక్వెల్ ఎప్పుడు వస్తుందంటూ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూడటం మొదలు పెట్టారు. తాజాగా ఈ ఎదురు చూపులకు మూవీ టీమ్ తెరదించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడురానుందనేది ప్రకటించేసింది.

- Advertisement -

భారత సినిమా ప్రేమికులంతా ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘Kantara Chapter 1’ వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అప్‌డేట్స్‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాకుండా న్యూఇయర్ స్పెషల్‌గా కూడా ఇటువంటి అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఈ విషయంలో కూడా మేకర్స్.. అభిమానులను డిస్సపాయింట్ చేయరన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి కూడా కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. కలరియపట్టును మాస్టర్ చేయడం కోసం రిషబ్ తెగ కష్టపడుతున్నాడు. దీంతో పాటుగా ఈ సినిమాలో ఎన్‌టీఆర్.. ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడని కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రిషబ్ ఇన్వైట్ చేస్తే తప్పకుండా చేస్తానని ఎన్‌టీఆర్ కూడా చెప్పడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. మరి చూడాలి ‘కాంతార పార్ట్:1’లో ఎన్‌టీఆర్ నటిస్తాడా లేదా అని.

Read Also: వైరల్ అవుతున్న చైతన్య, శోభిత వెడ్డింగ్ కార్డ్.. ఎలా ఉందంటే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...