OG First Single | ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..!

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌(OG First Single) రిలీజ్‌కు మూవీ టీమ్ కసరత్తులు చేస్తోంది. ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ ఫస్ట్ సింగిల్‌పై ఓజీ టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. సుజిత్(Sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఓజీ ఫస్ట్ సింగిల్‌ను నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్‌ను విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే తొలుత ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ ఆలోచనను విరమించుకున్నారు.

- Advertisement -

OG First Single | ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఓజీ పాటను విడుదల చేయడం సబబుగా ఉండదన్న కారణంగానే సెప్టెంబర్ 2న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పాటను న్యూఇయర్ స్పెషల్‌గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, పాట ఫైనల్ కట్‌ను రెడీ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కల్యాణ్.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. పవన్‌ను ఢీకొట్టే పాత్రలో ఇమ్రాన్ కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

Read Also: అవకాశమిస్తే దర్శకత్వం మానేస్తా: ప్రశాంత్ వర్మ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...