టాలీవుడ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వరుస హిట్‌లతో మాంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తోన్న భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.
వచ్చే దసరాకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రం(Bhagavanth Kesari) విడుదలకు ఇంకా 70 రోజులే ఉండటంతో నిర్మాతలు మరో అప్‌డేట్ ఇచ్చారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చేతిలో గొడ్డలి పట్టుకొని యాక్షన్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో శ్రీలీల నటిస్తోంది.