ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

-

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేకు ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ‘కల్కి’ హిట్‌తో ఫ్యాన్స్‌కు ఎక్కడలేని ఊపొచ్చింది. దీంతో ప్రభాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో చేయాలని వారు ఫిక్స్ అయిపోయారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని తరహాలో తమ అభిమాన హీరో బర్త్‌డే నిర్వహించాలని భారీ ప్లాన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ దేశమంతా ట్రెండ్ అయ్యేలా ఈ ప్లాన్స్ ఉండనున్నాయి. ఇందులో ప్రభాస్ మూవీ మేకర్స్ కూడా కలిశారు. ప్రభాస్ పుట్టనరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకోసం ప్రభాస్ నటించిన పలు సినిమాలను రీరిలీజ్ చేయనున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా మూడు నాలుగు సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ వార్త తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతులేస్తున్నారు.

- Advertisement -

ఈ నెల 19, 20 తేదీల్లో సలార్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ వేయాలని డిసైడ్ అయ్యారు. ఆ షో బుకింగ్స్ కూడా క్షణాల్లోనే అమ్ముడైపోయాయి. అదే విధంగా అక్టోబర్ 22న ప్రభాస్(Prabhas) నటించిన ఫ్యామిటీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ పర్వెక్ట్’ను రీరిలీజ్ చేస్తామని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అదే విధంగా ఈ నెల 22, 23 తేదీల్లో కర్ణాటకలో కూడా ప్రభాస్ ‘ఛత్రపతి’ పూనకాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. 23న డార్లింగ్ సినిమాను, టాలీవుడ్‌కు రెబల్ స్టార్ పరిచయం చేసిన ‘ఈశ్వర్’ను కూడా రీరిలీజ్ చేయనున్నారు. జపాన్ దేశంలో రాధేశ్యామ్, సాహో సినిమాలను స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ రేంజ్‌లో ఒక సినిమా నటుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరగడం ఇదే తొలిసారేమో అనిపిస్తోంది.

Read Also: సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...