సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు… ఆగస్టు 13న పుష్ప చిత్రం థియేటర్లో విడుదల కానుంది..ఇక ఈ సినిమా పోస్టర్లు చూసిన అభిమానులు బన్నీ లుక్ చాలా బాగుంది అంటున్నారు… బన్నీ మంచి రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్గా, లారీ క్లీనర్గా ఇందులో కనిపిస్తారు.
ఇక విడుదల అయిన పోస్టర్లు చూస్తే ఓ క్లారిటీ అనేది వస్తుంది, ఇందులో పూర్తిగా నల్లగా మాసిన గడ్డంతో కనిపిస్తాడు బన్నీ, స్టయిల్ లుక్ తో పాటు ఇందులో ఉంగరాల జుట్టు కూడా కనిపిస్తుంది. ఈమేకప్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ లుక్స్ చూస్తేనే తెలుస్తున్నాయి.
ప్రతిరోజు రెండు గంటల సమయం ఆయన మేకప్ కోసమే సరిపోతుందట. మొత్తం పూర్తిగా కనుబొమ్మలు జుట్టు మీసాలు చర్మం రంగు ఇలా అన్నీ కూడా పూర్తిగా మేకప్ చేసుకుంటున్నారట, ఇలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నారు అని తెలుస్తోంది..
తమిళనాడులోని తెన్కాశీలో ప్రస్తుతం షూట్ చేస్తున్నారు, ఇక ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.