ANR Biopic | ‘నాన్న బయోపిక్ చేయడం చాలా కష్టం’

-

అక్కినేని నాగేశ్వర రావు అలియాస్ ఏఎన్ఆర్ బయోపిక్‌(ANR Biopic)పై ఆయన కుమారుడు, నటుడు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాన్న మీద బయోపిక్ సినిమా చేయడం కంటే ఒక డాక్యుమెంటరీ చేయడం బెటర్’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు నాగ్(Akkineni Nagarjuna). నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబం అనేక వేడుకలు నిర్వహిస్తోంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. ఈ సందర్భంగానే ఏఎన్నార్ బయోపిక్ టాపిక్ వచ్చింది.

- Advertisement -

ఆ బయోపిక్(ANR Biopic) ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాదా? అని కొందరు నాగార్జునను అడగ్గా.. నాగార్జున ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చాడు. ఆలోచిస్తున్నాం, తీయాలని ఉంది కానీ, అతి త్వరలోనే తెరకెక్కిస్తాం.. వంటి సమాధానాలను అందరూ ఊహించారు. కానీ నాగార్జున మాత్రం అది అంత ఈజీ కాదంటూ అందరికీ షాకిచ్చాడు.

‘‘నాన్న జీవితాన్ని ఆధారంగా తీసుకుని సినిమా చేయడం చాలా కష్టం. ఆయన జీవితంలో ఎన్నో హై మూమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ చూపించడం సినిమాని బోరింగ్‌గా మార్చేసింది. సినిమాకి ఎప్పుడూ ఎత్తు పల్లాలు ఉంటేనే బాగుంటుంది. అయితే ఆయన పెట్టి పుట్టాడు. అందుకే ఎక్కువగా ఆయన జీవితంలో హైమూమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆయన జీవితంపై డాక్యుమెంటరీ చేసే ఉద్దేశం మాత్రం ఉంది’’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Read Also: డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ వేడుకలు..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...