మల్లేశం పాత్ర కోసం ముందు అనుకున్నది ఎవరిని అంటే..

మల్లేశం పాత్ర కోసం ముందు అనుకున్నది ఎవరిని అంటే..

0
116

ఒకరి కోసం కథ రాసుకుంటారు. మరొకరితో తీస్తారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో మామూలే. నిజంగా ఆ పాత్రకు వీళ్లే సరిగ్గా సరిపోయారు అని అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి. శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం మల్లేశం.

కథలోని ప్రధాన పాత్రధారి మల్లేశం కోసం ప్రియదర్శికంటే ముందు విజయదేవరకొండని, నానీని అనుకున్నారట దర్శకుడు రాజ్. అయితే వాళ్లిద్దరి కాల్షీట్లు మూడేళ్లదాకా సర్ధుబాటు కానందున ఆ పాత్ర ప్రియదర్శిని వరించింది. మల్లేశం పాత్రకి ప్రియదర్శి వంద శాతం న్యాయం చేశారని సినిమా చూసిన ప్రేక్షకులు దర్శకుడిని, హీరోని ప్రశంసిస్తున్నారు.