మామయ్య చిరంజీవి సినిమాలో మహేష్ పాత్ర తనకే కావాలని అల్లు అర్జున్ గొడవ

మామయ్య చిరంజీవి సినిమాలో మహేష్ పాత్ర తనకే కావాలని అల్లు అర్జున్ గొడవ

0
88

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు… ఈచిత్రం దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది… కొన్ని ముఖ్యమైన పాత్రలు ఇప్పుడు షూట్ చేస్తున్నట్లు టాక్… ఈ చిత్రంలో చిరును శివ సరికొత్త స్టైల్లో చూపించనున్నారు…

ఈ చిత్రంలో సుమారు 40 నిమిషాల పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు చిరుతోపాటు కీలక పాత్రలో నటించనున్నారని నిన్నా మొన్నటివరకు ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి… ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది… తన మామయ్య చిరంజీవితో కలిసి నటించాలని చాలా సంవత్సరాలనుంచి అనుకుంటున్న అల్లు అర్జున్ ఇప్పుడు రంగంలోకి దిగాడట…

ఈ పాత్ర తనకు ఇవ్వాలని స్వయంగా బన్నీనే మహేష్ ను రిక్వస్ట్ చేశాడట… ఈ విషయంలో తన తండ్రి అల్లు అరవింద్ ను కూడా రంగంలోకి దింపారట అల్లు అర్జున్… మరి కొరటాల శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి….